

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన అభిమానులకు ఇచ్చిన విలువైన సలహా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ఫ్యాన్ మీట్స్‌లో సినిమాలు, బాక్సాఫీస్ విషయాలపై మాట్లాడే హీరోలు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే శివకార్తికేయన్ మాత్రం యువత ఎదుర్కొంటున్న సోషల్ మీడియా నెగెటివిటీ, అనవసరమైన డిస్ట్రాక్షన్స్‌పై స్పందించారు. గత ఏడాది కాలంగా తాను క్రమం తప్పకుండా పుస్తకాలు చదవడం ప్రారంభించానని, ఈ అలవాటు తనకు ఎంతో ఉపయోగపడిందని తన అనుభవాన్ని పంచుకున్నారు.
తనకు నచ్చిన ఏ అంశంపై రాసిన పుస్తకమైనా చదవొచ్చని, రోజుకు కనీసం పది నిమిషాలు పుస్తక పఠనానికి కేటాయించాలని శివకార్తికేయన్ అభిమానులను కోరారు. పుస్తకం చదవడం మనసుకు సానుకూల అనుభూతిని కలిగిస్తుందని ఆయన చెప్పారు. గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్, ట్రోల్స్‌లో సమయం గడపడం కంటే ప్రతిరోజూ కొంత సమయాన్ని పుస్తకాలకు కేటాయించాలన్న ఆయన సూచన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒక స్టార్ హీరోగా యువతకు ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చారంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!