

యశ్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్’పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆగస్టు 26న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా సినిమాపై మాట్లాడిన యశ్.. ఇది పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన చిత్రమని స్పష్టం చేశారు. పిల్లలు ఈ సినిమా చూడొద్దని సూచించారు. పెద్దలకు మంచి, చెడు మధ్య తేడాను అర్థం చేసుకునే విచక్షణ ఉంటుందని, కథ నుంచి తాము ఏం తీసుకోవాలో వాళ్లే నిర్ణయించుకోగలరని అన్నారు. అందుకే పెద్దల కోసం ఈ చిత్రాన్ని ఎంతో నిజాయతీగా రూపొందించినట్లు తెలిపారు.
సినిమాలోని సన్నిహిత సన్నివేశాలు, ట్రైలర్, పాటలపై వచ్చిన విమర్శలపైనా యశ్ స్పందించారు. కథను నిర్దిష్ట దిశలో తీసుకెళ్లాలంటే ప్రతి పాత్రలోని విభిన్న కోణాలను ఆవిష్కరించడం అవసరమని చెప్పారు. ట్రైలర్, పాటల్లో కనిపించే సన్నివేశాలు రెండు పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించేవేనని వివరించారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ను సమర్థిస్తూ.. మహిళలకు కూడా తమ భావోద్వేగాలను వ్యక్తపరిచే హక్కు ఉందని యశ్ పేర్కొన్నారు. కేవలం ప్రచారం కోసం కాకుండా కథకు అవసరమైన సందర్భాల్లోనే ఆయా సన్నివేశాలను చిత్రీకరించినట్లు స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!