
రాజకీయాలు

యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. బుధవారం చిత్రబృందం 'లేడీస్ అండ్ లేడీస్' పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసి సినిమాలోని ఐదుగురు కథానాయికలను పరిచయం చేసింది. ప్రేమ అమ్మాయిలను మాన్స్టర్స్గా మారుస్తుందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ వీడియోలో నయనతార, రుక్మిణీ వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషిలను విభిన్నమైన యాక్షన్ లుక్స్‌లో చూపించారు.
వీడియో చివర్లో యశ్ "ఒక్కొక్కరుగా వస్తారా.. ఒకేసారి వస్తారా?" అంటూ ఐదుగురు కథానాయికలతో యాక్షన్ సన్నివేశంలో కనిపించిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!