
జనరల్

సీనియర్ నటి వడివుక్కరసి మృతి చెందారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని ఆమె స్వయంగా స్పష్టం చేశారు. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు ప్రచారం జరగడంతో అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తంతి టీవీతో మాట్లాడిన వడివుక్కరసి.. తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని, తన యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఫోన్ చేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
1978లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన వడివుక్కరసి దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. 350కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ సీరియళ్లలో భాగమైన ఆమె.. అరుణాచలం, శివాజీ, మొదల్ మరియాదై తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. 2026లో వచ్చిన కాన్ సిటీలోనూ ఆమె నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!