

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు గాయానికి కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన ఆయనకు మొదట విశ్రాంతి సరిపోతుందని భావించినప్పటికీ, గాయం తీవ్రత పెరగడంతో వైద్యులు సర్జరీ అవసరమని సూచించారు. హ్యాండ్ సర్జరీ నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. రామ్ చరణ్‌కు కనీసం రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని, ఫిజియోథెరపీ చేయాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో, కామినేని ఆస్పత్రులు దేశంలోనే ప్రసిద్ధి చెందినవే అయినప్పటికీ, రామ్ చరణ్ కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆర్థోపెడిక్, ముఖ్యంగా చేతి మరియు మణికట్టు శస్త్రచికిత్సల్లో గంగా హాస్పిటల్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ హ్యాండ్ సర్జరీలో నిపుణుడు కాగా, డాక్టర్ ఎన్ రాజశేఖరన్ కూడా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. మణికట్టు వంటి సున్నితమైన భాగానికి ప్రత్యేక మైక్రో సర్జరీ నిపుణులు అవసరమనే కారణంతోనే ఈ ఆస్పత్రిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!