

బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ సినిమాల్లో మహిళలకు గతంతో పోలిస్తే మరింత ప్రాధాన్యం కలిగిన పాత్రలు లభిస్తున్నాయని అభిప్రాయపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తాను ఎప్పుడూ తనకు నచ్చిన కథలు, తన నటనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే పాత్రలనే ఎంచుకుంటానని తెలిపింది. ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదని, ఏ పాత్ర తనను నమ్మకం కలిగించకపోతే ఆ సినిమాను వెంటనే తిరస్కరిస్తానని స్పష్టం చేసింది.
ఇకపై కొత్త తరహా పాత్రలు, ఇప్పటివరకు చేయని కథల్లో నటించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాజోల్ వెల్లడించింది. మహిళా ప్రాధాన్య కథలు ఇప్పుడు సరైన దిశలో ప్రయాణిస్తున్నాయని పేర్కొంటూ, మహిళలను కేవలం సహాయక పాత్రలకే పరిమితం చేయకుండా బలమైన, ప్రభావవంతమైన పాత్రలు రాస్తున్నారని ఆమె చెప్పింది. ఇది భారతీయ సినీ పరిశ్రమలో మహిళలకు మరింత విస్తృత అవకాశాలను తీసుకొస్తున్న సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!