

మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, హిందీ చిత్రసీమలో మహిళా పాత్రల మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా ప్రాధాన్య కథలు సరైన దిశలో సాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రచయితలు మహిళల కోసం బలమైన, అర్థవంతమైన పాత్రలను రూపొందిస్తున్నారని, కేవలం సహాయ పాత్రలకే పరిమితం కాకుండా కథలో పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తన సినిమా ఎంపికల గురించి మాట్లాడుతూ, ఇన్నేళ్ల కెరీర్‌లో తన విధానం ఎప్పుడూ మారలేదని కాజోల్ తెలిపారు. తనకు నచ్చిన, కొత్తగా చేసే అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటానని చెప్పారు. ఇకపై మరింత వైవిధ్యమైన, ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉందని వెల్లడించారు. కాలంతో పాటు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తాను కూడా మారానని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత దయగల వ్యక్తిగా మారానని కాజోల్ తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!