

తెలుగు సినిమాల్లో దాదాపు 25 ఏళ్ల క్రితం నటుడిగా కెరీర్ ప్రారంభించిన వెంకట్.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, భలేవాడివి బాసు, శివరామరాజు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో అడపాదడపా సినిమాల్లో కనిపించారు. ఇటీవల ఓజీ, మా నాన్న సూపర్ హీరో వంటి చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు.
చాలా కాలం తర్వాత వెంకట్ హీరోగా నటించిన ‘హరుడు’ పోలీస్ డ్రామాగా తెరకెక్కింది. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా దాదాపు మూడు నెలల తర్వాత ఎలాంటి హడావుడి లేకుండా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ముంబైలో మాఫియాను ఎదుర్కొన్న డీసీపీ శంకర్ హైదరాబాద్‌కు బదిలీపై రావడం, స్థానిక ఎమ్మెల్యే అక్రమాల వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడం చుట్టూ కథ సాగుతుంది. తన భార్య హత్యకు, కార్ల ఇంజిన్ల దొంగతనానికి ఉన్న సంబంధాన్ని శంకర్ ఎలా బయటపెట్టాడనేది సినిమాలో ఆసక్తికర అంశం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!