
సినిమాలు

ప్రసిద్ధ రచయిత హర్లాన్ కోబెన్ కథ ఆధారంగా తెరకెక్కిన ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సిరీస్ ‘ఐ విల్ ఫైండ్ యూ’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాను చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ తండ్రి, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంతో పాటు అదృశ్యమైన తన కొడుకును వెతికే ప్రయత్నమే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.
మొదటి సీజన్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల నిడివితో సాగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, ఉత్కంఠభరితమైన కథనం, భావోద్వేగాలు, ఊహించని మలుపులతో థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!