

నాస్టాల్జిక్ విలేజ్ డ్రామాగా తెరకెక్కిన సమ్మర్ హాలిడేస్ ఈరోజు ప్రామిసింగ్ బజ్‌తో థియేటర్లలోకి వచ్చింది. రోహన్ రాయ్, అరుణ్ దేవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. చిన్న బడ్జెట్‌తో రూపొందినప్పటికీ, కథా నేపథ్యం, పాత్రలపై ఆసక్తి కారణంగా ఈ చిత్రం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్యూరియాసిటీని పెంచుతోంది.
అయితే, ఈరోజే రామాయణ, సీన్ వంటి భారీ చిత్రాలు కూడా విడుదల కావడంతో సమ్మర్ హాలిడేస్కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ పోటీని తట్టుకుని సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది, వసూళ్లలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకర్ నయన్ జి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని నిర్మించారు. వాసుకి, హర్షవర్ధన్, జయసుధ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని సింజిత్ యెర్రమిల్లి అందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!