

మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆషా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఐశ్వర్య లక్ష్మి ఊర్వశి కూతురు అనఘ పాత్రలో నటించగా, జోజు జార్జ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న జోమన్ పాత్రలో కనిపించారు. గత నెల 11న మలయాళంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
‘ఆషా’ కథ విషయానికొస్తే.. ఓ చిన్న నర్సరీ నిర్వహించే ఆశా గతంలో జరిగిన ఓ ఘటన కారణంగా మానసికంగా కుంగిపోతుంటుంది. ఐటీ ఉద్యోగం చేసే కూతురు అనఘతో కలిసి జీవిస్తుంటుంది. ఒకరోజు రాత్రి ఇద్దరూ కారులో వెళ్తుండగా జోమన్ కారును ఢీకొంటారు. సాధారణంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన ఈ ఘటన చివరకు పోలీస్ కేసు వరకు వెళ్తుంది. ఈ పరిణామం తర్వాత ఆశా, అనఘ, జోమన్ కుటుంబాలు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, చివరకు ఏం జరిగిందనేదే సినిమాలో ఆసక్తికర అంశం. అక్టోబర్ 16 నుంచి జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘ఆషా’ స్ట్రీమింగ్ కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!