

కన్నడ నటి పాయల్ చెంగప్ప సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేయగా, శ్రి తేజ్ ఎస్‌కే దర్శకుడిగా పరిచయమయ్యారు. పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియలేదు. అక్టోబర్ 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే థియేటర్లలో విడుదలకు ముందే ‘మయూఖ’ సినిమాకు న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డు లభించింది. పాయల్ చెంగప్పతో పాటు దేవ్ డి, మురళీధర్ గౌడ్, అమన్ మసూద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శశిధర్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మించగా, సిబి మాథ్యూ అలెక్స్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ఈ సినిమాకు మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!