

పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘దాయ్రా’ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం హిందీ, మలయాళ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదిక ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఆసక్తికరమైన కథాంశంతో పాటు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు.
భారత్‌లో చోటుచేసుకున్న పలు పోలీస్ ఎన్కౌంటర్ వివాదాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఘటన నుంచి కొంత ప్రేరణ పొందినట్లు సమాచారం. అయితే, ఈ కథ ఒక్క ఘటనకు మాత్రమే పరిమితం కాకుండా పలు వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిందని దర్శకురాలు మేఘనా గుల్జార్ గతంలో స్పష్టం చేశారు. చట్ట అమలు, న్యాయం వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రం చర్చిస్తుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఈ సినిమాను చూసే అవకాశం లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!