
జనరల్

ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో రూపొందిన చిత్రాలకు డిజిటల్ వేదికలపై మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘సాయవనం’ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది.
అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవానంద్ షాజిలాల్, సౌందరరాజా, సంతోష్ దామోధరన్, అప్పుకుట్టి, జానకి, మాథ్యూ మాంప్రా, వెట్రివేల్ రాజా కీలక పాత్రల్లో నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్, సస్పెన్స్ కథలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఆహా వేదికపై వీక్షించవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!