
గాసిప్స్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప గత ఏడాది జూన్ 27న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో ఈ చిత్రం దక్షిణాది భాషల్లో ఓటీటీలో విడుదల కానుందని ప్రకటించినప్పటికీ, ఆ స్ట్రీమింగ్ జరగలేదు.
తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా అవా ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో జూలై 3 నుంచి విడుదల చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాస్తికుడిగా ప్రారంభమైన తిన్నడు జీవితం ఎలా పరమ శివభక్తుడిగా మారిందనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!