

ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్! సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘వ్వాన్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉండగా, తాజాగా ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా చూసే అవకాశం కల్పించారు. అంటే ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఇకపై ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు, ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ అప్‌డేట్ మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు.
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ‘వ్వాన్’ థియేటర్లలో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నాతో పాటు శ్వేతా తివారీ, సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ప్రైమ్ వీడియోలో అదనపు చెల్లింపులు లేకుండా అందుబాటులోకి రావడంతో ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. ఇంటి నుంచే తమకు నచ్చిన సమయంలో సినిమాను వీక్షించవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!