

యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సూపర్ సుబ్బు’ వెబ్ సిరీస్ జులై 2 నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వినోదం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు మంచి స్పందన అందుకోవడంతో ఈ సిరీస్పై ఆసక్తి పెరిగింది.
ఒక అమాయక యువకుడి జీవితంలో జరిగే సరదా సంఘటనల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని కూడా కథలో భాగం చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు మల్లిక్ రామ్ హాస్యాన్ని, భావోద్వేగాలను సమతుల్యంగా మేళవించినట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో కనిపించగా, మిథిలా పాల్కర్ కథానాయికగా నటిస్తున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!