
గాసిప్స్

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘త్రికాల’ థియేటర్లలో మంచి ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ వేదికల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఐఎండీబీలో 9.1 రేటింగ్ సాధించడం ద్వారా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.
మణి తెల్లగూటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ అవసరం, పునర్జన్మల భావనలను శక్తివంతమైన విజువల్స్ ద్వారా ఆవిష్కరించారు. పౌరాణికతను ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలతో ప్రేక్షకులకు భిన్నమైన సినీ అనుభూతిని అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!