

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూడాలా అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. మరోవైపు సినిమా వ్యాపారానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల విక్రయంపై వినిపిస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి సినిమాను వదులుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే ‘వారణాసి’ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం సినిమా మాత్రమే కాకుండా చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు, ఇతర అదనపు దృశ్యాల హక్కులను కూడా కలిపి ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చెల్లించినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ మొత్తంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగా ఇంత భారీ ఒప్పందం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!