

థియేటర్లలో అద్భుత విజయాన్ని అందుకున్న ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ వేదిక సోనీలివ్ (SonyLIV) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబరు 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అనంతరం సోనీ మ్యాక్స్‌లో టెలివిజన్ ప్రీమియర్ కూడా కానుంది. హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తొలిరోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ టాక్‌తో క్రమంగా భారీ విజయాన్ని అందుకుంది.
అయితే హిందీలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అక్టోబరు 9న హోంబలే ఫిల్మ్స్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయగా.. తొలి రోజు సుమారు రూ.60 లక్షల నెట్ వసూళ్లు సాధించింది. కథ విషయానికొస్తే.. తల్లిని కోల్పోయిన లక్ష్మీనారాయణ అనే బాలుడు భగవంతుడి గురించి తెలుసుకోవాలనే అన్వేషణ ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు అతడి జీవితాన్ని ఎలా మార్చాయి? చివరకు అతడు నీమ్ కరోలి బాబాగా ఎలా మారాడు? అనే అంశాలను ఇందులో చూపించారు. భక్తి, విశ్వాసం, మానవత్వం, సేవాభావం వంటి విలువలకు దర్శకుడు ప్రాధాన్యం ఇచ్చారు. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం లభించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!