

ఈ లాంగ్ వీకెండ్‌లో థియేటర్లలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. ఓటీటీ వేదికలు ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రధాన గమ్యస్థానంగా మారాయి. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, ఫాంటసీ, వెబ్ సిరీస్‌లు ఇలా వివిధ జానర్లకు చెందిన సినిమాలు, సిరీస్‌లు ఈ వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్, లయన్స్‌గేట్ ప్లే తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద సంఖ్యలో కంటెంట్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘చుంబక్’, ‘ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్’, ‘హార్ట్ ఐస్’, ‘ఫౌదా: సీజన్ 5’ తదితర చిత్రాలు, సిరీస్‌లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మగుడం’, ‘మహారాజా హాస్టల్’, ‘రక్కసపురదోల్’, ‘ది రివల్యూషనరీస్’తో పాటు మరికొన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఆహాలో ‘కాటాలన్’, ‘వెంజియెన్స్’, జీ5లో ‘వీరభద్రుని రహస్యం: సీజన్ 1 – పార్ట్ 2’, ‘పంచనామా’, ‘వరవు’, ‘ఘమాసాన్’, జియో హాట్‌స్టార్‌లో ‘ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’, ‘అలీబాబా ఔర్ 40 భూత్’, ‘ది పేపర్: సీజన్ 2’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్‌లో ‘కొలవెరి’, ‘బ్లూ స్టార్’, సన్ నెక్స్ట్‌లో ‘వివాహ్’, లయన్స్‌గేట్ ప్లేలో ‘హంగ్రీ’ కూడా వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!