

తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య నెలకొన్న విభేదాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. ఎంపీ లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. నేతలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని అభయ్ పాటిల్ సూచించారు.
అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో కలిసి ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని, బీఆర్ఎస్పై విశ్వాసం తగ్గిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలపడుతుందని, అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేతలంతా కలిసి పనిచేస్తారని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!