

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు అభయ్ పాటిల్ చర్చలు జరిపినట్లు సమాచారం. గత విషయాలను పక్కన పెట్టి పార్టీ భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని ఇద్దరు నేతలకు సూచించినట్లు తెలిపారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలని, పార్టీ లైన్‌లోనే ముందుకు సాగాలని అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ, పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!