
రాజకీయాలు

ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. శనివారం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన లోకేష్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్రచికిత్స, భుజం గాయం, ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల గురించి లోకేష్ వివరాలు తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని, పూర్తిగా కోలుకునే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!