

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పెద్దారెడ్డి నివాసంపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు, ఆయనకు చెందిన వాహనాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ దాడిలో సుమారు పది వాహనాలు ధ్వంసమయ్యాయని, దాదాపు 20 బైక్లకు నిప్పు పెట్టారని తెలుస్తోంది. ఇంట్లోని అద్దాలు, ఫర్నిచర్ సైతం ధ్వంసమైనట్లు సమాచారం.
తాడిపత్రిలో నిన్నటి నుంచి వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ఇళ్లపై జేసీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. వరుస దాడులతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలపై పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!