
సినిమాలు

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా పేర్లు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియను “షా ప్రేరేపిత తొలగింపు”గా అభివర్ణించిన రమేశ్.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలపై ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
తొలి రెండు దశల్లో 7.8 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారని, ప్రస్తుతం కొనసాగుతున్న మూడో దశలోనూ మరిన్ని తొలగింపులు, నోటీసులు జారీ అవుతున్నాయని రమేశ్ తెలిపారు. అయితే SIR లక్ష్యం అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, డూప్లికేట్, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడమేనని ఎన్నికల సంఘం చెబుతోంది. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, అప్పీల్‌కు కూడా అవకాశం ఉందని ECI స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!