

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 83 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1943 జూన్ 7న గుంటూరు జిల్లా ఉంగుటూరులో జన్మించిన ఆయన 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1996, 1998, 2004, 2009 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు.
రాయపాటి సాంబశివరావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుసార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించిన ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. సుదీర్ఘ ప్రజాసేవతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!