
జనరల్

ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్న కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో ఎన్నికల నిర్వహణకు కమిషన్ సిద్ధమైంది. ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
ఎన్నికలు జరగనున్న వాటిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్టు కేసుల కారణంగా ఇంతకాలం వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల షెడ్యూల్, నామినేషన్లు, ప్రచారం తదితర ప్రక్రియలపై స్పష్టత రానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!