

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు నేతలకు అబద్ధాలు చెప్పడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపించారు. అలాంటి వారికి హాసనాంబ దేవి తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. హాసన్ జిల్లాలో పర్యటించిన ఆయన.. అక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాసనాంబ ఆలయ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీ పథకాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మేకెదాటు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు అమలుతో కర్ణాటక కంటే తమిళనాడుకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన చేసిన విమర్శలు, ఆలయ అభివృద్ధికి నిధుల ప్రకటన, సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలు కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!