
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. తనను హత్య చేయడానికి టెహ్రాన్ ప్రయత్నిస్తే ప్రపంచ పటంలో ఇరాన్ ఉండదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

ఇప్పటికే వెయ్యికి పైగా క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా వేలాది మిసైళ్ళు సిద్ధం చేసి ఉంచామని ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో, తనపై ఎలాంటి హత్యాయత్నం జరిగినా ఇరాన్‌పై భారీ దాడి చేయాలని యూఎస్ సైన్యానికి ముందస్తు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!