

విజయవాడ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 23న జరగనుంది. ఈ కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు, వివిధ రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేత వంగవీటి రాధా స్పందించారు. ప్రమాణ స్వీకారంపై మాట్లాడే ముందు సంబంధిత నిబంధనలు, రూల్ పొజిషన్ తెలుసుకోవాలని సూచించారు. కొందరి వ్యవహారశైలి అంబేద్కర్‌ను అవమానించేలా ఉందని ఆరోపించారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.
మరోవైపు, కూటమి 98.4 శాతం స్థానాల్లో విజయం సాధించిందని ఎంపీ చిన్ని తెలిపారు. విజయవాడలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, నిబంధనల ప్రకారమే అంబేద్కర్ కళావేదికను ఎంపిక చేశామని స్పష్టం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. మాట్లాడిన వారిని కాకుండా, వారి వెనుక ఉండి మాట్లాడించిన వారినే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. కూటమి విజయాన్ని అంబేద్కర్‌కు అంకితం చేయాలని భావించామని, ఆయనకు క్షమాపణ చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!