

జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌తో శంషాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఆధ్వర్యంలో గొల్లపల్లి రోడ్డులో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, బీసీ సంఘాల నేతలు సభలో పాల్గొననున్నారు.
జాతీయ జనగణనలో ఓబీసీ కుల గణనను చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సభ ద్వారా కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. బీసీల జనాభా లెక్కల ఆధారంగా వారికి హక్కులు, సంక్షేమ ఫలాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయనున్నారు. ఓబీసీ కుల గణనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు, బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నట్లు నేతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!