
క్రీడలు

నరేంద్ర మోదీ 12 సంవత్సరాలుగా నిరంతరం ఎన్నికైన ప్రధానిగా దేశానికి సేవలందిస్తూ మరో చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసి ఈ మైలురాయిని చేరుకున్నారు. వారం రోజుల యూరప్ పర్యటనతో ఈ ఘనత సాధించారు.
ప్రధానమంత్రి కార్యాలయ వెబ్సైట్ ప్రకారం, 2014 జూన్ 15–16 తేదీల్లో భూటాన్‌కు చేసిన పర్యటన మోదీ తొలి అధికారిక విదేశీ పర్యటనగా నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన 78 దేశాలను సందర్శించి భారతదేశ గ్లోబల్ సంబంధాలను బలోపేతం చేశారు.
మొదటి దఫాలో 49 విదేశీ పర్యటనలు, రెండో దఫాలో 27 పర్యటనలు చేసిన మోదీ, ప్రస్తుత కాలంలో జీ-7 సదస్సులో పాల్గొని జూన్ 18న భారత్‌కు తిరిగి రానున్నారు. దీంతో ఈ దఫాలో 24వ పర్యటన పూర్తవుతుంది మరియు మొత్తం 100 విదేశీ పర్యటనల మైలురాయిని చేరుకుంటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!