

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. పీసీసీ జూమ్ సమావేశంలో మాట్లాడిన ఆయన, అనుమానాస్పద ఓటర్ల పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా 2026 అక్టోబర్ నాటికి తుది రూపు దాల్చే అవకాశం ఉన్నందున ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పటిష్టమైన మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వలసలు వెళ్లిన ఓటర్లు, తాత్కాలికంగా నివాసంలో లేని వారి ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ మాట్లాడుతూ ప్రతి ఓటును ప్రజాస్వామ్య హక్కుగా భావించి దాన్ని కాపాడేందుకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచి ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!