
సినిమాలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆమె తిరుగు ప్రయాణానికి పలు చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన అప్పగింత ఒప్పందం ప్రకారం అధికారిక ప్రక్రియ ద్వారానే ఆమెను తీసుకురావాలని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య చట్టపరమైన, దౌత్యపరమైన అంశాలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు, షేక్ హసీనా పాస్‌పోర్ట్ రద్దు కావడం కూడా ఆమె ప్రయాణానికి సవాలుగా మారింది. ఆమె ప్రయాణానికి అవసరమైన చట్టపరమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అప్పగింత ప్రక్రియతో పాటు ప్రయాణ పత్రాల అంశం కూడా ముడిపడి ఉండటంతో ఆమె తిరుగు ప్రయాణంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!