

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలోని వివరాల ప్రకారం.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5,68,105 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 6,21,086 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్ ceotelangana.nic.inలో పరిశీలించవచ్చు.
ముసాయిదా జాబితాపై డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించనున్నారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఇదే గడువులోగా ఓటు నమోదు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్ ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!