25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

Writer: Pooja 04:16 PM, 25 నవంబర్, 2026
‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన నటి పూజిత పొన్నాడ చిత్రబృందంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పూర్తి స్థాయి పాత్ర ఇస్తామని చెప్పి, చివరకు ఒక్క సన్నివేశానికే పరిమితం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తనకు జరిగిన మోసంగా అభివర్ణించారు. తొలుత పూర్తి నిడివి ఉన్న పాత్ర కోసం చిత్రబృందం తనను సంప్రదించిందని, లుక్‌ టెస్టులు నిర్వహించిన అనంతరం దర్శకుడు త్రివిక్రమ్‌ స్వయంగా తనను ఎంపిక చేశారని వెల్లడించారు.

రచయిత తనకు సినిమా పూర్తి కథను వివరించారని, తన పాత్ర కథ ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ వరకు ఉంటుందని చెప్పారని పూజిత తెలిపారు. నారా రోహిత్‌తో కలిసి కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేసి అడ్వాన్స్‌ కూడా తీసుకున్నానని చెప్పారు. అయితే కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత దాదాపు మూడు నెలల వరకు చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. తన పాత్రను తగ్గించబోమని హామీ ఇచ్చినప్పటికీ, తనకు తెలియకుండానే మరో సీనియర్‌ నటిని ఆ పాత్రలోకి తీసుకున్నట్లు తర్వాత తెలిసిందని వెల్లడించారు.

థియేటర్లలో సినిమా చూసినప్పుడు తన పాత్ర కేవలం ఒక్క సన్నివేశానికే పరిమితమై ఉండటం చూసి షాక్‌కు గురయ్యానని పూజిత పేర్కొన్నారు. మళ్లీ షూటింగ్‌ చేసేందుకు సమయం లేకపోవడంతో తనకు సంబంధించిన సన్నివేశాలను అలాగే ఉంచారని చెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా, సినిమాలో తన పేరును క్రెడిట్స్‌లో కూడా చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇస్తామని చెప్పి, చివరకు ఒక్క సన్నివేశానికే పరిమితం చేయడం తనను మోసం చేసినట్లుగా ఉందని అన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

‘దాదా’ టైటిల్ తో మరో సౌత్ స్టార్ హీరో..!

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

శ్రీలంకలో అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

శ్రద్ధా కపూర్‌ ‘ఈథా’పై నెటిజన్ల విమర్శలు

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘ఆకాశంలో ఒక తార’

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

ట్యాగ్లు
పూజిత పొన్నాడఆదర్శ కుటుంబంవెంకటేష్త్రివిక్రమ్తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..
జనరల్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!
టెక్నాలజీ

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..
రాజకీయాలు

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..
జనరల్

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
బిజినెస్

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే
ఓటీటీ

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన
జనరల్

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..
క్రీడలు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!