
జనరల్

పేపర్‌లెస్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ అమలుకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా డిజిటల్ విధానంలో, పేపర్‌లెస్ పద్ధతిలో నిర్వహించబడనున్నాయి.
డిజిటల్ క్యాబినెట్ అమలులో భాగంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందజేశారు. క్యాబినెట్ సమావేశాల ఎజెండా, పత్రాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ట్యాబ్‌ల ద్వారానే అందుబాటులో ఉంచనున్నారు. డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వ్యవస్థను అమలు చేస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!