
రాజకీయాలు

మహిళా బస్సు కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రయాణికురాలు బస్సు నుంచి కిందకు నెట్టేయడంతో తీవ్రంగా గాయపడిన ప్రవళిక చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఆమె పార్థివదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని తెలిపారు. మణుగూరు డిపోలో ఆర్టీసీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తోందని, అక్కడ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో బస్సు సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!