
రాజకీయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా వార్తాపత్రికలు చదవడానికే ఉపయోగిస్తానని తెలిపారు. అందులో ముఖ్యంగా తన గురించి వచ్చిన వార్తలను ఎక్కువగా చదువుతానని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా వాన్స్ హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వైట్‌హౌస్ చరిత్రపై ఉన్న ఒక పుస్తకాన్ని చదివి వినిపించడంతో పాటు మాజీ అధ్యక్షుల ఆసక్తులు, అలవాట్ల గురించి మాట్లాడారు. వైట్‌హౌస్‌లో నిర్మిస్తున్న బాల్రూమ్ గురించి కూడా ప్రస్తావించారు. సూపర్‌బౌల్ వీక్షణం, అధ్యక్షుల రీయూనియన్ ఐడియా వంటి విషయాలను సరదాగా పంచుకున్నారు. బిల్ క్లింటన్ వంటి మాజీ అధ్యక్షుల వ్యక్తిగత అలవాట్లను కూడా గుర్తు చేసుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!