
షోస్

మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ఓటర్ల జాబితా సవరణలపై నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తుషార్ గాంధీ నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించి, అభిజీత్ దీప్కే చేపట్టిన ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, గాయకుడు విశాల్ దద్లానీ తదితరులు కూడా హాజరయ్యారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన నిర్ణయాలపై వచ్చిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన నిరసన రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!