

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్యలకు గట్టి ప్రతిస్పందన తప్పదని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపర్చడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మూడు ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల అనంతరం అమెరికా తన ప్రతిస్పందనను మరింత ఉధృతం చేసింది. మరోవైపు పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దళాలు కూడా దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!