
రాజకీయాలు

అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ప్రతి పెట్రోల్ బంక్‌లో ఈ10, ఈ20, ఈ0 అనే మూడు రకాల పెట్రోల్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు తమ వాహనానికి అనుకూలమైన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు.
దేశంలో సుమారు 22 కోట్ల మోటార్‌సైకిళ్లు, 8 కోట్ల కార్లు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ20ను తప్పనిసరిగా అమలు చేస్తే ఇలాంటి వాహనాలు క్రమంగా స్క్రాప్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అన్ని రకాల వాహనాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు రకాల పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!