

ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2024లో తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవద్దని ఆమె కోరారు. ఈ పిటిషన్లో ఎన్నికల సంఘం, దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. విజయారెడ్డి పిటిషన్‌పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఫారం-26 కింద వెల్లడించాల్సిన ఆస్తులు, ఇతర వివరాలను పూర్తిగా పొందుపరచలేదని ఆరోపిస్తూ విజయారెడ్డి 2024లో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యాజ్యం పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, దానిపై తీర్పు వెలువడిన తర్వాతే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆమె తాజా పిటిషన్లో కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!