

2020 ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విస్తృత కుట్రకు సంబంధించిన కేసులో సామాజిక కార్యకర్త ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరణను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ ప్రతిభా ఎం. సింగ్, జస్టిస్ దినేష్ భట్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
జనవరి 2026లో సుప్రీంకోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ, రక్షిత సాక్షుల విచారణ పూర్తైన తర్వాత లేదా జనవరి 5 నాటి ఉత్తర్వుల నుంచి ఏడాది పూర్తైన తర్వాత బెయిల్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఆ రెండు షరతుల్లో ఏదీ నెరవేరలేదని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు విధించిన నిబంధనలను సవరించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఖాలిద్, ఇమామ్‌లకు హైకోర్టు బెయిల్ నిరాకరించడం ఇది మూడోసారి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!