

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ క్రికెట్‌కు వెలుపల మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడంతో పాటు, బీజేపీ నేషనల్ ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్పెషల్ ఇన్వైటీగా నియమితులయ్యారు. ఢిల్లీ నుంచి ఆయనకు ఈ అవకాశం కల్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. అంతకుముందు చహల్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించి, తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ నబీన్, అమర్‌పాల్ మౌర్యలకు చహల్ కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు చహల్ మాజీ భార్య, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ తన కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ‘హే కన్నమ్మ’ అనే తెలుగు మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాతో ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. యశ్వంత్ మాస్టర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ధనశ్రీ తన సినీ అరంగేట్రంపై భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ట్రైలర్‌కు లభించిన అద్భుతమైన స్పందన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఈ ప్రయాణం తనకు ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. తమ సినిమాపై ప్రేమాభిమానాలు చూపించిన తెలుగు మీడియా, సినీ పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలతో నిండిన హృదయంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. ‘హే కన్నమ్మ’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!