

ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి విడుదల తేదీ మారే అవకాశముందంటూ ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జోరందుకుంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పెద్ద సినిమాలు విడుదల తేదీని మార్చుకున్నప్పుడు, ఆ ఖాళీ సమయంలో తమ చిత్రాలను విడుదల చేసేందుకు ఇతర నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఏప్రిల్ 7 తేదీపై కూడా ఇదే తరహా చర్చ జరుగుతోంది.
తాజా కోలీవుడ్ సమాచారం ప్రకారం.. శివకార్తికేయన్ నటిస్తున్న సేయోన్ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. లార్డ్ మురుగన్ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్ నటించిన థాయ్ కిళవి చిత్రంతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అయితే విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!