

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుండటంతో ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల పేర్లపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో యాంకర్ ఛర్మిల పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా ఆమె ఈ వార్తలపై స్పందించి, బిగ్‌బాస్ 10లోకి తాను వెళ్లడం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్‌గా ఛర్మిల మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఈవెంట్‌లో ఆమె యాంకర్‌గా వ్యవహరించగా, నిర్మాత అల్లు అరవింద్ ఆమెను ప్రశంసిస్తూ తన సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పారు. అలాగే ‘అగధ’ సినిమా కార్యక్రమంలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి కూడా ఆమెను హీరోయిన్‌గా నటిస్తారా అని అడిగారు.
అయితే తాను యాంకర్‌గా ఎదగాలని కోరుకుంటున్నానని, సినిమాల్లో నటించే ఆలోచన లేదని ఛర్మిల అప్పట్లో స్పష్టం చేశారు. తాజాగా ఆమెకు బిగ్‌బాస్ 10లో అవకాశం వచ్చిందనే వార్తలు ప్రచారం కావడంతో, సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం లేదని, ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారనే ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!