

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో సోమవారం ప్రసారమైన 10వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. రాజకుమారి ఫైర్ కార్డ్ వినియోగానికి ఇదే చివరి రోజు కావడంతో, ఆమె దాన్ని ఉపయోగించి ఓట్ అప్పీల్ చేసే అవకాశాన్ని సంపాదించుకుంది. మరోవైపు శ్రష్టికి మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా జ్యూరీ ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో రోహిత్‌కు ఎల్లో కార్డ్ జారీ కాగా, మరో కంటెస్టెంట్‌కు కూడా ఎల్లో కార్డ్ వచ్చినట్లు ఎపిసోడ్‌లో చూపించారు.
ఎపిసోడ్‌లో భాగంగా స్ట్రాంగ్ టీమ్, వీక్ టీమ్‌గా కంటెస్టెంట్లను విభజించి ఫిజికల్ టాస్కులు నిర్వహించారు. రోహిత్, మిథిలేష్ మధ్య ఆర్మ్ రెజ్లింగ్‌లో రోహిత్ విజయం సాధించాడు. శ్రష్టి, అపూర్వ మధ్య జరిగిన పోటీలో శ్రష్టి గెలిచింది. అనంతరం పురుషులు, మహిళలకు విడివిడిగా మ్యూజికల్ చైర్ నిర్వహించగా, విజేతలను స్ట్రాంగ్ టీమ్‌లోకి పంపించారు. ఫిజికల్ టాస్క్ సమయంలో ఆట ఉద్రిక్తంగా మారడంతో కొద్దిసేపు నిలిపివేసి, నిబంధనలు మరోసారి వివరించిన తర్వాత కొనసాగించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!