24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ

Writer: Shivani K 11:26 PM, 24 నవంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 79 ఎపిసోడ్ 80 ఆసక్తికర పరిణామాలతో సాగింది. 'బడ్డీ అప్' థీమ్‌లో భాగంగా గత సీజన్ల కంటెస్టెంట్లు ఇమ్ము, సంజన, దివ్య, కళ్యాణ్ పడాల హౌస్‌లోకి అతిథులుగా వచ్చి సందడి చేశారు. వారితో కలిసి ప్రస్తుత ఇంటి సభ్యులు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచేందుకు వివిధ టాస్కుల్లో పాల్గొన్నారు. మొదటగా వచ్చిన ఇమ్ము, సంజన.. ఆర్కే, త్రిగుణ్‌లతో జతకట్టారు. డబ్బాలను పాము ఆకారంలో పేర్చే టాస్కులో ఇమ్ము తన తెలివితేటలతో ఆర్కేకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో టాస్క్ నిబంధనల విషయంలో ఆర్కేకు స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు, సంచాలక్‌గా వ్యవహరించిన అమన్, ముకేష్ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇక సుధీర్ 13వ వారంలోకి నామినేషన్లు లేకుండా అడుగుపెట్టడంపై ఇంటి సభ్యులు సరదాగా చర్చించుకున్నారు. టికెట్ టు ఫినాలే గెలవడమే తన లక్ష్యమని సుధీర్ చెప్పాడు. మరోవైపు, కెప్టెన్ రూమ్‌లో కాఫీ డబ్బా కనిపించకపోవడంతో అమన్ అసహనం వ్యక్తం చేశాడు. తన ప్రోటీన్ డబ్బా మిస్ కావడంతోనే కాఫీ డబ్బాను తీసుకున్నానని శివ్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వచ్చిన ఇమ్ము.. త్రిగుణ్, వంశీల ప్రవర్తనను తన సీజన్‌తో పోలుస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఆర్కే ఆటను చూడాలని బయట ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు.

ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చిన కళ్యాణ్ పడాల, దివ్య మరో టాస్క్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు కూరగాయల పేర్లతో కూడిన కార్డులు ఇచ్చి, వారి వ్యక్తిత్వాలకు సరిపోయే లక్షణాలను కేటాయించారు. ముకేష్‌కు కాకరకాయ, దేబ్జానీకి ఉల్లి, త్రిగుణ్‌కు మిరపకాయ, ఆర్పీకి టమాట, నరేష్‌కు ఆలూ వంటి కార్డులు ఇచ్చి సరదాగా ఆట సాగించారు. అనంతరం 'గేమ్ ఆఫ్ ఎయిమ్' టాస్కులో శివ్, ఆర్పీ పోటీపడగా.. ఇటుకల సాయంతో బాల్స్ సంపాదించి ప్రత్యర్థి జట్టు గోడపై ఉన్న ఫోటో ఫ్రేమ్‌లను పగలగొట్టాల్సి వచ్చింది. ఈ టాస్కులో కళ్యాణ్ తన వ్యూహంలో భాగంగా ఆర్పీ విసిరిన బాల్స్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరేశాడు.

ఈ చర్యపై త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా, అది నిబంధనలకు విరుద్ధమని దివ్య కూడా ప్రశ్నించింది. ఈ క్రమంలో ముకేష్, దివ్య మధ్య మాటల యుద్ధం మొదలైంది. 'గెస్టువి.. గెస్టులా మాట్లాడు' అంటూ ముకేష్ వ్యాఖ్యానించడంతో దివ్య తీవ్రంగా స్పందించింది. ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? అంటూ అతడిని ప్రశ్నించింది. చివరకు ఈ టాస్కులో కళ్యాణ్ పడాల, శివ్ విజయం సాధించారు. ఈ పరిణామాలతో ఎపిసోడ్ ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు

‘మెగావర్స్‌’తో ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ప్రోమో విడుదల

‘మెగావర్స్‌’తో ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ప్రోమో విడుదల

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్ బాస్ 10: ముకేష్, త్రిగుణ్‌లపై నీతూ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ ఇంట్లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ..

బిగ్‌బాస్ ఇంట్లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ..

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్

‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల.. జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన వెబ్ సిరీస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ డే 79ఎపిసోడ్ 80కళ్యాణ్ పడాలదివ్యఇమ్ముసంజనత్రిగుణ్ముకేష్శివ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ తొలి జాబితా విడుదల
రాజకీయాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ తొలి జాబితా విడుదల

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్
జనరల్

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
జనరల్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!
క్రీడలు

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!
సినిమాలు

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
జనరల్

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!
సినిమాలు

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు
షోస్

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్
బిజినెస్

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!